Mandapeta: కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా వేయించుకోవాలి..

మండ‌పేట‌ (CLiC2NEWS): కేంద్రం సరఫరా చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా వేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ అన్నారు. శనివారం సత్యశ్రీ రోడ్డు సర్థార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. డాక్టర్ కళ్యాణి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ను ఆయన అడిగి తెలుసుకున్నారు. డోస్ లు పూర్తి స్థాయిలో సరఫరా అవుతున్నాయా అని అడిగితెలుసుకున్నారు. 45 ఏళ్లు నిండిన వారితో పాటు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్లే వారికి, దేవాలయ దర్శనాలను వెళ్లే వారికి అయా సంస్థలు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లు అడుగుతున్నారని అందుచేత అటువంటి వారికి అందరికీ ఆధార్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ శనివారం 300 డోసులు వచ్చాయని తెలిపారు. వ్యాక్సినేషన్ కు ముందుగా పేర్లు నమోదు కానివారు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆధార్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా వేయించుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న కొంత మందికి జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి ప్రభావాలు చూపించినా కంగారు పడాల్సిన పని లేదన్నారు. టీకా వేయించుకున్న తర్వాత కేంద్రం వద్ద ఇచ్చే మాత్రలను సూచించిన విధంగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది అన్నారు. అలాగే రెండు రోజుల పాటు మాంసాహారానికి, మద్యం అలవాటు ఉన్న వారు ఆల్కహాల్ కు కొన్ని రోజులు దూరంగా ఉంటే సరిపోతుంది అన్నారు. ఏ ఎన్ ఎంలు సరస్వతి, రమ, ఉమ, మేరీలు టీకాలు వేశారు. అలాగే ఒకటో వార్డు కౌన్సిలర్ వాళ్ల వార్డులో ఉండే ప్రజలకు దగ్గరుండి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది గోపి, వలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.