కోటిరాగాల నల్లని కోయిలమ్మ గొంతు మూగబోయింది
సీతారామశాస్త్రి అస్తమయం

సీతారామశాస్త్రి మరణంతో సినీ పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖలు పలువురు ఆయన మృతి పట్ల సంతాపాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. 1986 కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంతో పాటల రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సీతారామశాస్తి.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. ఆదే సినిమాకు ఉత్తమ గేయ రచయితగా ఆవార్డుని కూడా అందుకున్నారు.
సీతారామశాస్త్రి 800లకు పైగా చిత్రాలలో సుమారు 3వేలకు పైగా పాటలు రాశారు. కేంద్రప్రభుత్వం 2019లో పద్మశ్రీని అందించింది. ఆయన ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్‌లు అందుకున్నారు. ఇటీవల వచ్చిన వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. ఆర్ ఆర్ ఆర్ లో`దోస్తి` పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధలను చేశాయి.
దర్శకుడు కె.విశ్వనాధ్ తో అన్ని సినిమాలకు పనిచేశారు. విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అనిపిలిచేవారు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు అనటంలో అతిశయోక్తిలేదు.