ఓఆర్ఆర్ చుట్టూ 23 కి.మీ. మేర సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు శంకుస్థాపన
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఓఆర్ఆర్ చుట్టూ 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి ఐటి, పురపాలక శాక మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించబోయే ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా 23 కి.మీ. మేర 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగే విధంగా నిర్మించనున్నారు. ఈ నిర్మాణం 2023 వేసవి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ ఎండిఎ లక్ష్యం. మొదటగా నానక్‌రాంగూడ నుండి టిఎస్పిఎస్ వరకు 8.5 కి.మీ.. నార్సంగి నుండి కొల్లూరు వరకు 14.5 కి.మీ. మేర సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం జరుగనుంది.