TS: `గిఫ్ట్ ఏ స్మైల్`లో వాహనాలు పంపిణి చేసిన కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS) : హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వికలాంగులకు ప్రకటించిన త్రిచక్ర వాహనాలను పంపిణీచేశారు. ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది నుండి గిప్ట్ ఎ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంవత్సరం 130 స్కూటర్లను అందించారు. ఆయనతో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు150, ఎమ్మెల్యేలు కృష్ణారావు 100, వివేకానంద్ 50, ఎమ్మల్సీలు నవీన్ 100, శంబీపూర్ రాజు 63 స్కూటర్లను అందించేందుకు ముందుకొచ్చారని ఆయన తెలిపారు.