రూ. 1,656 కోట్ల పెట్టుబ‌డి.. 35 వేల మందికి ఉద్యోగ‌వ‌కాశాలు..

ఫాక్స్‌కాన్ టెక్నాల‌జీస్ ప్లాంట్‌కు భూమిపూజ చేసిన కెటిఆర్‌

రంగారెడ్డి (CLiC2NEWS): మొబైల్ ఫోన్లు, ఎల‌క్ల్రానిక్స్ ఉత్ప‌త్తుల త‌యారీలో ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ . సుమారు రూ. 1656 కోట్ల పెట్టుబ‌డితో రంగారెడ్డి జిల్లాలోని కొంగ‌ర‌క‌లాన్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఫాక్స్‌కాన్ టెక్నాల‌జీస్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కెటిఆర్ భూమిపూజ చేశారు. 196 ఎక‌రాల స్థ‌లంలో ఈ నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఇటీవ‌ల సిఎం కెసిఆర్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ ఛైర్మ‌న్ యంగ్లూ నేతృత్వంలో ఆ సంస్థ ప్ర‌తినిధులు స‌మావేశ‌మ‌య్యారు. యాంగ్‌లియూతో క‌లిసి రాష్ట్ర మంత్రులు కెటిఆర్‌, స‌బితా ఇంద్రారెడ్డి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ ప‌రిశ్ర‌మ‌లో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ‌వ‌కాశాలు రానున్న‌ట్లు స‌మాచారం.

ఈ సంద‌ర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఇది తెలంగాణ‌కు చిర‌కాలం గుర్తుంచుకునే రోజ‌న్నారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రం వ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని..ఫాక్స్‌కాన్ సంస్థ‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా నిలుస్తుంద‌ని మంత్రి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఎల‌క్ల్రానిక్స్ మాన్య‌ఫాక్చరింగ్ ప‌వ‌ర్‌హౌస్‌గా మార్చుతామ‌ని అయ‌న వెల్ల‌డించారు. ఈ కంపెనీ మొద‌టి ద‌శ‌లో 25వేల ఉద్యోగాలు ల‌భిస్తామ‌ని.. యువ‌త‌కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.