మూసీ పక్కన మూడేళ్లు ఉండేందుకు సిద్ధం: కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): మూసీ పక్కన మూడు నెలలు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. మూసీపక్కన మూడేళ్లు ఉండేందుకు సిద్దమేనని.. దమ్ముంటే మూసీ లోతు పెంచి బలమైన కోల్‌కతా లాంటి నగర నిర్మాణ చేయాలని సూచించారు. సరైన డిపిఆర్ లేకుండా ముందుకెళ్లడం మూర్ఖత్వమని, మూసీ బాధితులకు బిఆర్ ఎస్ అండగా ఉండి.. వారి తరపున న్యాయపోరాటం చేస్తుందన్నారు.
నాగోల్‌లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని (ఎస్టిపి)మాజి మంత్రులు, జిహెచ్ ఎమ్‌సి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కెటిఆర్ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 386 కోట్లతో కెసిఆర్ ప్రభుత్వం 31 ఎస్టిపిలను నిర్మించేందుకు సిద్ధమైందని గుర్తు చేశారు. రూ. 545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించిన ఘనత కూడా కెసిఆర్‌కే దక్కిందని తెలిపారు. మూసి నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కెసిఆర్ నిర్మించిన రెండు పడక గదులేనని కెటిఆర్ వెల్లడించారు.