శాంతిభ‌ద్ర‌త‌ల వైఫ‌ల్యానికి వికారాబాద్ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం: కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల వైఫ‌ల్యానికి వికారాబాద్ ఘ‌ట‌నే నిద‌ర్శ‌న‌మ‌ని బిఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ అన్నారు. సిఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఏకంగా క‌లెక్ట‌ర్‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డార‌న్నారు. వికారాబాద్ జిల్లా కలెక్ట‌ర్ , అద‌న‌పు క‌లెక్ట‌ర్, ఇత‌ర రెవెన్యూ అధికారుల‌పై జ‌రిగిన దాడిపై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

సిఎం మూర్ఖ‌త్వం వ‌ల‌నే అధికారులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. ఇపుడు ఫార్మాసిటి భ‌విత‌వ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. ఫార్మాసిటి ఏర్పాటుకు సిద్దంగా ఉన్న భూముల‌ను ర‌ద్దు చేశారు. ప‌దిచోట్ల ఫార్మాక్ల‌స్ట‌ర్లు పెట్టాల‌నే ఆలోచ‌న వ‌ల్లే ఇదంతా జ‌రిగింది. కొడంగ‌ల్లో రైత‌న్న‌ల భూములు గుంజుకునే కుట్ర మొద‌లైంది. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో అసంతృప్తి, ఆగ్ర‌హం క‌ట్టలు తెంచుకుంటోంద‌ని కెటిర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.