హైకోర్టులో కెటిఆర్‌కు ఊర‌ట ..

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌ను ఈ నెల 30 వర‌కు అరెస్టు చేయోద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. ఫార్మాలా -ఇ కార్ రేస్ కేసు వ్య‌వ‌హారంలో మాజి మంత్రి కెటిఆర్‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. కేసు న‌మోదు ఎఫ్ ఐఆర్‌ను క్వాష్ చేయాల‌ని కెటిఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. శుక్ర‌వారం లంచ్ మోష‌న్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ఇప్ప‌టికే పూర్త‌యినందున మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఎపి సుద‌ర్శ‌న్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. కెటిఆర్ త‌ర‌పున సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది సందరం, ప్ర‌భాక‌ర్‌రావు, గండ్ర మోహ‌న్రావు హైకోర్టులో వాద‌న‌లు వినిపించారు. అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద పెట్టిన సెక్ష‌న్లు ఈ కేసుకు వ‌ర్తించ‌వని, ఎఫ్ ఐఆర్‌ను క్వాష్ చేయాల‌ని కోరారు. ఇరు వాద‌న‌లు విన్నా న్యాయ‌స్థానం .. ఈ నెల 30 వ‌ర‌కు కెటిఆర్‌ను అరెస్టు చేయెద్ద‌ని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.