రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలిగించ‌డం మూర్ఖ‌పు నిర్ణ‌య‌మే: కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొల‌గించ‌డం హైద‌రాబాదీల‌ను విస్మ‌రించ‌డ‌మేన‌ని బిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష‌డు కెటిఆర్ విమ‌ర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్ర‌తిపాద‌న దృష్ట్యా బిఆర్ ఎస్ నేత‌లు చార్మిన్ వ‌ద్ద‌కు వెళ్లి నిర‌స‌న తెలిపారు. న‌గ‌ర ప్ర‌గ‌తి క‌నిపించ‌కుండా కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని , కెసిఆర్ పేరు క‌నిపించ‌కుండా ప్ర‌భుత్వం మూర్ఖ‌పు నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌న్నారు. రాజ‌కీయ క‌క్ష‌తోనే మార్పు చేస్తోంద‌న్నారు. హైద‌రాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్య‌మంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన‌లేదు. కెసిఆర్ పెట్టిన గుర్తులు మార్చాల‌ని చూస్తున్నారు. లోగో మార్పుపై బిఆర్ ఎస్ త‌ర‌పున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాం అని కెటిఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.