రాబోయే రోజుల్లో ప్రపంచదేశాలకు భారత్ దిక్సూచి: కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ సైనికులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమై భారత్.. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు దిక్సూచిగా ఉంటుందని ఆకాంక్షించారు. విభిన్న మతాలు, కులాలు, సంప్రదాయాల కలిగిఉన్న మనదేశంలో దేశభక్తి విషయంలో అంతా కలిసి ఉంటారిని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కెటిఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అమరులైన సైనికుల కుటుంబాలకు మహావీర్ పురస్కారాలను అందజేశారు. దేశభక్తి గీతాలాపన. సైనిక బృందాల నృత్యాలు, సాంస్కృతిక వేడుకలను నిర్వహించారు.