కాళేశ్వ‌రం జ‌ల‌స‌వ్వ‌డిలో కెసిఆర్‌..

అసెంబ్లీ స‌మావేశాల్లో కెసిఆర్‌పై ప‌ద్యం

హైద‌రాబాద్ (CLiC2NEWS): శాస‌న‌స‌భ‌లో బుధ‌వారం బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌ కొన‌సాగుతుంది. ఈ స‌భా స‌మావేశాల్లో కెటిఆర్ ప్ర‌సంగిస్తూ.. ప‌దేళ్ల బిఆర్ఎస్‌ ప‌రిపాల‌న‌లో కెసిఆర్‌వి చెరిపివేయ‌లేని ఆన‌వాళ్లు ఉన్నాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కెసిఆర్‌పై ప‌ద్యం చ‌దివారు.

కాళేశ్వ‌రం జ‌ల‌స‌వ్వ‌డిలో కెసిఆర్‌
కాక‌తీయ చెరువు మ‌త్త‌డిలో కెసిఆర్‌
భ‌గీర‌థ న‌ల్ల నీళ్లల్లో కెసిఆర్‌
పాల‌మూరు జ‌ల‌ధార‌ల్లో కెసిఆర్‌
సీతారామ ఎత్తిపోతల్లో కెసిఆర్‌
గురుకుల బ‌డిలో కెసిఆర్‌
యాదాద్రి గుడి య‌శ‌స్సులో కెసిఆర్‌
విర‌జిమ్మే విద్యుత్ వెలుగుల్లో కెసిఆర్‌
మెడిక‌ల్ కాలేజీల వైద్య‌విద్య విప్ల‌వంలో కెసిఆర్‌
క‌లెక్ట‌రేట్ భ‌వ‌న కాంతుల్లో కెసిఆర్‌
క‌మాండ్ కంట్రోల్ సెంట్ర‌ల్ హైట్స్‌లో కెసిఆర్‌
స‌చివాల‌యపు రాజ సౌధ‌వంలో కెసిఆర్‌
టిహ‌బ్, డి వ‌ర్క్స్ సృజ‌న‌లో కెసిఆర్‌
వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల ద‌ర్జాలో కెసిఆర్‌
అంబేద్క‌ర్ విగ్ర‌హం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన అంబేద్క‌ర్ విగ్ర‌హ మెరుపుల్లో కెసిఆర్
అమ‌ర దీపం ఆశ‌యాల్లో కెసిఆర్‌..అంటూ కెటిఆర్ ప‌ద్యం చ‌దివారు.

 

Leave A Reply

Your email address will not be published.