కేంద్ర రక్షణశాఖ మంత్రికి కెటిఆర్ లేఖ

హైదరాబాద్(CLiC2NEWS): కంటోన్మెంట్ పరిధిలో పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లు మూసేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో.. కరోనా పేరుతో రోడ్లు మూసేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ యాక్ట్ సెక్షన్ 258కి ఈ చర్యలు విరుద్ధమని తెలిపారు. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలు సార్లు కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని కెసిఆర్ పేర్కొన్నారు. ఇక్కడ లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డు వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసి వేసిందని, ఈ మూసివేత లక్షలాదిమందికి అనేక ఇబ్బందులు తీసుకువస్తుందని మంత్రి లేఖలో తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కేటీఆర్ కోరారు.