నాసీటు వదులుకొనేందుకు సిద్ధం: కెటిఆర్
మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నా..

హైదరాబాద్ (CLiC2NEWS): మహిళా రిజర్వేషన్‌లో భాగంగా నా సీటు వదులుకోవాడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామన్నారు. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందన్నారు. మన జీవితాలు చాలా చిన్నవని.. నా పాత్ర నేను పోషించానన్నారు. మహిళా రిజర్వేషన్‌లో భాగంగా సీటు పోతే పోనివ్వండి అని మంత్రి కెటిఆర్ అన్నారు.