BheemlaNayak :లాలా భీమ్లా’ ప్రోమో అదిరింది!
Lala Bheemla Song Promo

ప్రోమో గురించి తెలియజేస్తూ మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌లో ముదురు ఎరుపు రంగు షర్ట్, గళ్ల లుంగీలో ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన ముందు మందు బాటిల్ పెట్టుకుని మాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు.
పవన్ కల్యాణ్ , రానా తో కలిసి నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్ . సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ సర్‌ప్రైజ్ అందించారు. ‘ది సౌండ్ ఆఫ్ భీమ్లా’ పేరుతో ప్రోమోను విడుదల చేశారు. నిత్య మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
‘నాగరాజుగారు హర్టీ కంగ్రాచ్చులేషన్స్ అండి..మీకు దీపావళి పండుగ ముందే వచ్చేసిందండి ..హ్యాపీ దీపావళి’ అంటూ పవన్ డైలాగ్స్ తో సాగుతున్న ప్రోమో మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.