లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఐదేళ్ల జైలు.. రూ. 60లక్షల జరిమానా
రాంచి (CLiC2NEWS): ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ. 60 లక్షల జరిమానా కూడా విధించింది. మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దాణా కుంభకోణంలో ఆఖరిదయిన డొరండా ఖజానా కేసులో లాలూ తోపాటు మరో 99 మంది నిందితులపై రాంచీలోని న్యాయస్థానం విచారణ జరిపింది. గత మంగళవారం లాలూని దోషిగా తేల్చింది.
రూ. 950 కోట్ల దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూకి జైలు శిక్షలు విధించింది. డొరంఆ ఖజానా కేసు చివరిది. నకిలీ బిల్లులతో రూ. 139.5 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా పొందిన ఈ కేసులో మొత్తం 170 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది వీరిలో 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరపున సాక్షలుగా మారారు. ఇద్దరు నేరం అంగాకరించాగా ఆరుగురు పరారీలో ఉన్నారు.