వ‌య‌నాడ్‌లో కొండ‌చ‌రియ‌ల బీభ‌త్సం… 91 మందికి పైగా మృతులు

వ‌య‌నాడ్ (CLiC2NEWS): కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ జిల్లాపై ప్ర‌కృతి క‌న్నెర్ర‌జేసింది. ఆహ్లాదంగా ఉండే ఈ ప్రాతం లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి బీభ‌త్సం సృష్టించాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో ఈ ప్రాంతంలో ఎన్నో ఇళ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. జిల్లాలోని మెప్పాడి, ముండ‌కై, చుర‌ల్‌మ‌ల ప్రాంతాల‌లో ఈ ఘోర విపత్తుచోటుచేసుకుంది. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కు 91 మంది మృతి చెందిన‌ట్లు కేర‌ళ రెవెన్యూ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. మ‌రో 116 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది.

తొలుత వయ‌నాడ్ జిల్లాలోని ముండ‌కై ప్రాంతంలో సోమ‌వారం అర్థ‌త్రి దాటాక కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. విష‌యం తెలుసుకున్న అధికారులు, స‌హాయక సిబ్బంది ప‌లువురు బాధితుల‌ను స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించారు. ప్ర‌మాద వ‌శాత్తు తెల్ల‌వారు జామున 4 గంట‌ల‌కు స‌హాయ శిభిరాల వ‌ద్ద మ‌రోసారి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌తో పాటు స‌హాయ శిబిరం కూడా కొట్టుకుపోయి. ఈప్రాంతంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో ప‌దుల సంఖ్య‌లో ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. చుర‌ల్‌మ‌ల‌లో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. ఆర్ఠీ, ఎన్డీఆర్ ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. కాగా ఈ ప్రాంతంలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం క‌లుగుతోంది. ముండ‌కై ప్రాంతంలో ఈవాళ మ‌ధ్యాహ్నం మ‌రోసారి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్లు స‌మాచారం. బుర‌ద‌లో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం స‌హాయ బృందంలు గాలింపు చేప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేర‌ళ స‌ర్కార్ ఈ నెల 31ని సంతాప దినంగా ప్ర‌కంటించింది.

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.