లంక గ్రామాలు.. పలు చోట్ల ఇంకా రాకపోకలకు ఇబ్బందులు

కాకినాడ (CLiC2NEWS): కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి… దీంతో పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. శివాయలంక, కె. ఏనుగుపల్లి లంక ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఎదురుబీడెం కాజ్వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్నపల్లి కాజ్‌వేపై రాకపోకలుపూర్తిగా నిలిచిపోయాయి.
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 15.30 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని ఇడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొత్త లంకకు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.