తాడేపల్లి గూడెంలో లారీ ప్రమాదం.. నలుగురు మృతి

పశ్చిమగోదావరి (CLiC2NEWS): తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపలలోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దువ్వాడ నుండి నారాయణ పురానికి చేపల లోడుతో వస్తున్న లారీ ప్రమాదానికి గరైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.