TS: యువకుడి పైకి దూసుకెళ్లిన లారీ

సిరిసిల్ల (CLiC2NEWS): సిరిసిల్ల పరిధిలోని జగ్గారావు పల్లెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక జగ్గారావుపల్లెలో నిన్న (గురువారం) అర్థరాత్రి దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న యువకులపైకి ఇసుక లారీ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తాళ్ల అఖిల్ గౌడ్ (21) అనే యువకుడు తీవ్రంగా గాయాలపాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో జగ్గారావు పల్లెలో తీవ్ర విషాదం నెలకొన్నది.