28 నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర..

నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వా యర్‌లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఏర్పాట్లును పూర్తి చేసింది. ఆగ‌స్టు 28న‌ హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలం కు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారుల తెలిపారు. ప్రతి వారంతపు శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి వున్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు, చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్దుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతుంది. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఆదివారం సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు.

వివరాలు..
శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 21న‌ ఖరారు చేసినప్పటికీ సరిపడా ప్రయాణికులు లేక పోవడంతో టూరిజం శాఖ వారు ట్రిప్పును రద్దు చేశారు. తిరిగి వారంతపు శనివారం 28వ తేదీన శ్రీశైలం లాంచీ ట్రిప్పును ప్రారంభిస్తున్న ట్లు తెలిపారు. ప్రయాణానికి సంబంధించిన వివరాలు, టికెట్ ధరలను అన్‌లైన్‌లో పొందవచ్చునని తెలి పారు. పర్యాటకుల కోసం హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ ఫొన్ నం 7997951023 అందుబాటులో ఉంచారు.

Leave A Reply

Your email address will not be published.