నేడు `టీఎస్ లాసెట్` ఫలితాలు
హైదరాబాద్ (CLiC2NEWS): మూడు, ఐదు సంవత్సరాల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ఫలితాలు నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్‌లు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు https://lawcet.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ తెలిపారు. ఆగస్టు 23, 24 తేదీల్లో లాసెట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.