తెలంగాణలో లాసెట్, పిజిఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో లా సెట్, పిజి ఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. జూలై 12వ తేది వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. మూడేళ్ల ఎల్ఎల్‌బి కోసం జూలై 21 వ తేదీన లా సెట్, ఐదు సంవత్సరాల ఎల్ ఎల్‌బి, ఎల్ ఎల్ ఎం కోసం జూలై 22వ తేదీన ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.