కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల నేతలు..
ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు నేతలు కేంద్ర కేబినేట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి బండి సంజయ్, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కిషన్ రెడ్డికి మరో సారి కేంద్ర మంత్రివర్గం లో చోటుదక్కింది. ఎపి నుండి తెలుగు దేశం యువ నేత రామ్మోహన్ నాయుడు తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రామ్మోహన్ నాయుడు మూడోసారి ఎంపిగా గెలిచారు. ఈ సారి ఏకంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. అదేవిధంగా నరసాపురం ఎంపి శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినేట్ లో చోటు దక్కింది. ఆయన బిజెపి కార్యకర్తగా ప్రారంభమై 34 ఏళ్ల నుండి పార్టికి సేవలందించారు. గుంటూరు ఎంపిగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రిగా ఇవ్వనున్నట్లు సమాచారం.