లీకేజి కేసు: కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన టి ఎస్ పి ఎస్ సి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స్టేట్‌పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రశ్న ప్రతాల లీకేజీ కేసును సిబిఐ అప్పగించాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ పై టి ఎస్ పి ఎస్ సి కౌంటరు దాఖలు చేసింది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేప్టటనుంది. కాగా ప్రశ్నపత్రం లీకేజీ కేసును సిబిఐకి బదలీ చేయాలంటూ ఎన్ ఎస్ యు ఐ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మద్యకాలంలో హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాల్సిందిగా టి ఎస్ పిఎస్ సిని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ టి ఎస్ పిఎస్ సి కౌంటర్ దాఖలు చేసింది. వెంటక్ పిటిషన్‌ను కొట్టి వేయాలని న్యాయస్థానికి కోరింది. అలాగే లీకేజీ పై పోలీసు విచారణ కొనసాగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఈ కేసుపై సోమవారం హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది.