కౌశిక్‌రెడ్డికి షాక్: మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు
హైదరాబాద్ (CLiC2NEWS): కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు. దీంతో హుజురాబాద్ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. తెలంగాణ పిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్‌నోటీసు జారీ అయ్యాయి. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. లేకపోతే కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.