మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష వేయొచ్చు, వేరే సాక్ష్యం అవసరం లేదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష వేయొచ్చని.. అందుకు మద్దతుగా వేరే సాక్ష్యం అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరణ వాంగ్మూలానికి మద్దతుగా వేరే సాక్ష్యం లేదంటూ ట్రయల్ కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో ఓ మహిళను ఆమె మావ, బావ కలిసి నిప్పు పెట్టి హత్య చేశారని చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు. దీని ఆధారంగా ట్రయల్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే మరణ వాంగ్మూలానికి వేరే సాక్ష్యం లేదంటూ ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. దీనిపైవిచారించిన సుప్రీం ధర్మాసనం.. మరణ వాంగ్మూలం నిజమని, స్వచ్ఛందమని న్యాయస్థానం సంతృప్తి పడితే వేరే సాక్ష్యం అవసరం లేకుండానే శిక్ష వేయెచ్చని పేర్కొంది.