ఆ తప్పిదాన్ని సరిదిద్దాం..: మస్క్

న్యూయార్క్ (CLiC2NEWS): అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ పునరుద్ధరించడం.. ఆ తర్వాత ట్రంప్ దానిలో ఒక్క పోస్టు కూడా చేయకపోవడంపై.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు..
`పునరుద్దరించిన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ ట్విట్ చేయకపోతే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎలాంటి ఉల్లంఘనలకు చేయకుండానే.. ఆయన ఖాతాలను తొలగించడం వంటి ఘోర తప్పును సరిదిద్దడం జరిగింది. అది సరిచే యడమే ప్రధానం. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఖాతాను తొలగించడంతో యుఎస్ ఎ లో భారీ సంఖ్యలో ప్రజలు ట్విట్టర్‌పై విశాసం కోల్పోయారు..“ అంటూ మస్క్ తన ఉద్దేశాన్ని వెల్లడించారు.
ఇటీవల ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా? వద్దా? అంటూ అని మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించిన విషయం తెలిసిందే. దానిపై 15 లక్షలకు పైగా స్పందించారు. వారిలో మెజారిటీ మంది పునరుద్ధరణకు మొగ్గుచూపారు. దాంతో ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది.