సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేద్దాం: డిజిపి మహేందర్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన నిర్వహించే జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీనుండి వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఈ వేడుకలు విజయవంతం చేయడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించారని అభినందించారు. అదేవిధంగా ఈ నెల 16వ తేదీన నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రతి ప్రాంతంలో అందరూ పాల్గొనేలా అధికారులంతా కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ గ్రామస్థాయి నుండి అన్ని ప్రధాన రహాదారులు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, పోలీసు కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర దేశాల్లో సామూహికంగా అందరూ జాతీయ గీతాన్ని ఆలపించాలని డిజిపి సూచించారు.