శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ‌న కురుస్తున్న భార్షాల‌తో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో అధికారులు 33 గేట్లను ఎత్తివేసి 4.04 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

  • శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుక
  • ప్రస్తుత నీటిమ‌ట్లం 1089.3 అడుగులు
  • ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు.
  • ప్ర‌స్తుతం 81.17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

కాగా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 44,771 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12,652 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

  • నిజాంసాగ‌ర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1404.16 అడుగుల నీటిమట్టం ఉన్నది.
  • పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు.
  • జలాశయం నీటిసామర్థ్యం 17.8 టీఎంసీలు
  • ప్రస్తుతం 16.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
Leave A Reply

Your email address will not be published.