శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తివేత‌

నిజామాబాద్ (CLiC2NEWS): గ‌తవారం రోజుల‌నుంచి కురుస్తున్న ఎడ‌తెరిపి లేని వర్షాల‌తో రాష్ట్రంలోని జ‌లాశాయాలు నిండుకుండ‌ల్లా మారాయి. భారీ వ‌ర్షాల‌కు ప‌లు గ్రామాలు నీట మునిగాయి. ఎగువ‌న కురిసిన వ‌ర్షాల‌తో పాటు అతి భారీ వ‌ర్షాల‌తో శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో జ‌లాశ‌యంలోకి 2,45,500 క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో అధికారులు 34 గేట్లు ఎత‌తి 2,17,850 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 1091 అడుగులు కాగా.. ప్ర‌స్తుతం 1087.40 అడుగుల‌కు చేరింది. ఇంకా ప్రాజెక్టులో 90 టిఎంసిల నీటిని నిల్వ చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ప్రాజెక్టులో 74,506 టిఎంసిల నీటి నిల్వ ఉన్న‌ది. అలాగూ నిజాం సాగ‌ర్ ప్రాజెక్ట‌కు కూడా వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. ప్ర‌స్తుతం ప్రాజెక్టులో 9420 క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహం వ‌స్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17,284 టిఎంసిలు.

Leave A Reply

Your email address will not be published.