Hyderabad: హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/JALMANDALI.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): · ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు జలకళ వచ్చింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను శుక్రవారం జలమండలి అధికారులు ఎత్తారు. రిజర్వాయర్ రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 700 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ కు 700 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.760 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.15 అడుగులు ఉంది.