జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/Gandipet-750x430.jpg)
వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు జలకళ
జలాశయాలకు భారీగా చేరుతున్న వరదనీరు
ఇప్పుటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జలాశయాలు
మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పిన వాతావరణ శాఖ
హిమాయత్‌సాగర్ రెండు గేట్లు, ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేత
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్(గండిపేట) జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీనికి తోడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 686 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల అధికారులకు జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు.