శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
నల్లగొండ (CLiC2NEWS): ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
గురువారం ఉదయం శ్రీశైలం నుంచి 4,72,708 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ వరద నీరు నాగార్జు న సాగర్ జలాశానికి చేరడంతో సాగర్ మొత్తం 26 గేట్లను ఎత్తినీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4,38,446 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,36,672 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత జలాశయం నీటిమట్టం 588.00 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టిఎంసిలకు గాను ప్రస్తుతం 306.1010 టిఎంసిల నీరు నిల్వ ఉంది.