మద్యం అక్రమాలపై సిఐడితో విచారణః ఎపి సిఎం చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. సందర్భంగా సిఎం శాసన సభలో మట్లాడారు. ..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎపి రాష్ట్రం ఎంత నష్టపోయిందో మేం విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాల ద్వార బహిర్గతం అవుతోందని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం, లిక్కర్ ఔట్‌లెట్స్ తగ్గింపు అని చెప్పి… అని మరిచారని అన్నారు.
పొరుగు రాష్ట్రాలతో చూస్తే ఏపిలో మద్యం ధరలు బాగా పెంచారు.. అయినా ఎపిలో ఆదాయం తగ్గిందన్నారు. ఎందుకంటే పెరిగిన ఆదాయం అంతా వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని అన్నారు…
ఇతర శాఖల్లోని డబ్బులను తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టారు. దాంతో ఆయా శాఖలకు దాదాపు రూ. 250 కోట్ల నష్టం వాటిళ్లిందని స్ఫష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రక్షాళన ఏ విధంగా చేయాలో శాసన సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తేనే మళ్లీ తప్పు జరగకుండా ఉంటుందని అన్నారు. మంత్రు లందరూ వారి శాఖల్లోని అవకతవకల్ని వెలికి తీయాలని సూచించారు.