ఢిల్లీ మ‌ద్యం కేసు.. సిఎం కేజ్రివాల్ స‌తీమ‌ణి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఢిల్లీ (CLiC2NEWS): లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఇడి క‌స్ట‌డీలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న క‌స్ట‌డి ఈ నెల 28తో ముగియ‌నుంది. త‌న అరెస్టును స‌వాల్ చేస్తూ కేజ్రివాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నేడు హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న స‌తీమ‌ణి సునీత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ కేసుకు సంబంధించిన నిజానిజాల‌ను గురువారం కోర్టులో త‌న‌భ‌ర్త బ‌య‌ట‌పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మద్యం కేసుకు సంబంధించి ఇడి ఇప్ప‌టివ‌ర‌కు 250 సార్లకు పైగా సోదాలు నిర్వ‌హించింద‌ని, అయినా వారికి ఏమీ దొర‌క‌లేద‌న్నారు. లిక్క‌ర్ స్కామ్ డబ్బు ఎక్క‌డుందో న్యాయ‌స్థానంలో కేజ్రీవాల్ చెబుతార‌ని, అందుకు త‌గిన ఆధారాలు కూడా ఇస్తార‌ని ఆయ‌న సతీమ‌ణి వెల్ల‌డించిన వీడియో సందేశం విడుద‌ల చేశారు.

మ‌రోవైపు కేజ్రివాల్ అరెస్టును నిర‌సిస్తూ ఆప్ లీగ‌ల్ సెల్ కోర్టు ప్రాంగ‌ణాల్లో ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. దీనిపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్న‌త న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టుల్లో నిర‌స‌న‌లు చేప‌డితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని, న్యాయ‌స్థానాల కార్య‌క‌లాపాల‌ను ఆప‌కూడ‌దు. ఎవ‌రైనా అతిక్ర‌మిస్తే అది ప్ర‌మాద‌క‌ర చ‌ర్యేన‌ని వెల్ల‌డిండించింది.

Leave A Reply

Your email address will not be published.