స్థానికుల‌కే మ‌ద్యం దుకాణాలు: మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

నేటి నుంచి మ‌ద్యం దుకాణాలకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

హైద‌రాబాద్ (CLiC2NEWS): నూత‌న మ‌ద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుద‌ల నేప‌థ్యంలో నేటి నుంచి 18వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్ల‌డించారు. నూతన మద్యం పాలసీలో దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజులను పెంచలేదని మంత్రి తెలిపారు. కొత్త మద్యం విధానంతో అన్ని వర్గాలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడవచ్చని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ద‌ర‌ఖాస్తుల ధ‌ర‌, లైసెన్స్ ఫీజు పెంచ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. బ్యాంక్ గ్యారంటీ కూడా త‌గ్గించామ‌న్నారు. ప్ర‌భుత్వానికి డ‌బ్బు చెల్లించే వాయిదాలు కూడా పెంచామ‌ని మంత్రి పేర్కొన్నారు. స్థానికుల‌కే దుకాణాలు ద‌క్కేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

గౌడ్‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు.. సిఎం కు కృతజ్ఞతలు

ఎస్సీ, ఎస్టీ, గౌడ్ లకు రిజర్వేషన్లు కల్పించిన సిఎం కెసిఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మద్యం షాప్‌లో మాఫియా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో కల్తీ, విదేశీ మద్యం అమ్మేవారు కానీ ఇప్పుడు అలా లేదు అని స్ప‌ష్టం చేశారు. గుడుంబాను నియంత్రించామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.