‘జయమ్మ..’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలచేసిన జక్కన్న..

హైదరాబాద్ (CLiC2NEWS): సుమ కనకాల ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ ఈ చిత్రం నుండి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘కాసింత భోళాతనం.. కాసింత జాలిగుణం’ .. అంటూసాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ గాత్రమందించారు. విజయ్ కలివారపు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.