తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పార్టి అధిష్టానం ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటనలో తెలియజేశారు.
ఎమ్మెల్యే కోటా నుండి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారంలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సిపిఐ అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ రాత్రి లోపు అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.