TS: పంద్రాగస్టు నుంచి పంట రుణమాఫీ
తెలంగాణ కేబినెట్‌కీలక నిర్ణయం
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండేళ్లుగా రూ. 25 వేల వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశారు. ఇప్పడు ఆగస్టు 15 నుంచి రూ.50 వేల వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏడాది రూ. 50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పంద్రాగస్టు నుంచి నెలాఖరులోపు రూ. 50 వేల రుణమాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా రాష్ట్రంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, రుణమాఫీ, ఇతర వ్యవసాయ అంశాలతోపాటు పత్తిసాగుపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.
Super