సెప్టెంబర్ మెదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్!
హైదరాబాద్ (CLiC2NEWS): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఈ నెల 29న మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దీనిలో స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతర రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలున్నట్లు తెలుస్తుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ ఖరారు చేసి.. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశమున్నట్లు సమాచారం.
Hyderabad: టెంట్ వేస్తున్న క్రమంలో కరెంట్‌షాక్‌కు గురై వ్యక్తి మృతి