Lockdown: కేర‌ళ‌లో లాక్‌డౌన్‌

తిరువ‌నంత‌పురం(CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టి కే ప‌లు రాష్ట్రాలు క‌రోనా క‌ట్ట‌డికోసం నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధించాయి. తాజాగా కేర‌ళ‌లో కూడా భారీగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ఈ నెల 8 నుంచి 16 వ‌ర‌కు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు సిఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌క‌టించారు.

విజ‌య‌న్ మాట్లాడుతూ..
కేర‌ళ రాష్ట్రంలో పాజిటివ్ రేటు త‌గ్గ‌లేద‌న్నారు. అందుక‌ని కోవిడ్ క‌ట్ట‌డికోసం లాక్‌డౌన్ త‌ప్ప‌ట్లేద‌న్నారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 42 వేల‌ క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో అత్య‌ధికంగా క‌రోనా విజృంభిస్తున్న 30 జిల్లాల్లో కేర‌ళ‌కు చెందిన 10 జిల్లాలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.