LockDown: మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీ!

హైదరాబాద్ (CLiC2NEWS): క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం రేప‌ట్నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్‌షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మందు బాబులు మ‌ద్యం దుకాణాల‌వైపు ప‌రుగులు పెట్టారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వైన్స్‌ దుకాణాల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరారు. కొన్ని మ‌ద్యం షాపుల వ‌ద్ద దాదాపు కిలోమీట‌రు మేర మందుబాబులు బారులు తీర‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో… ల‌క్డీకాపూల్‌, నారాయ‌ణ‌గూడ‌, ఇందిరాపార్క్‌, బంజారాహిల్స్‌, కుతు్బుల్లాపూర్‌, క‌వాడిగూడా, సికింద్రా బాద్ చైతన్య‌పురి త‌దిత‌ర ప్రాంతాల్లోని మ‌ద్యం షాపుల వ‌ద్ద ర‌ద్దీ నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.