మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సోమవారం నారా లోకేశ్ బాధ్యతలను స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం 4వ బ్లాక్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మెగా డిఎస్సీ ఫైలుపై తొలిసంతకం చేశారు. 16347 పోస్టుల భర్తీకి సంబంధించిన విధివిధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి లోకేశ్‌కు మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, ఎమ్మెల్యేలు బొండో ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, టిడిపి ఎపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.