పవన్‌కల్యాణ్‌ను కలిసిన లండన్ మేయర్ అభ్యర్థి

హైదరాబాద్ (CLiC2NEWS): లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరినట్లు సమాచారం. భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నారని.. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు అందరూ తరుణ్ గులాటి విజయానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ కోరినట్లు ప్రకటనలో తెలిపారు.