త్వ‌ర‌లో అందుబాటులోకి భారీగా మెడిక‌ల్ సీట్లు: మంత్రి స‌బిత‌

హైదరాబాద్ (CLiC2NEWS): క‌రోనా స‌మ‌యంలో వైద్యులందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబాల‌ను వ‌దిలి రోగుల‌కు సేవ‌లు చేశార‌ని కొనియాడారు. య‌శోదా ఆస్ప‌త్రి 10వ వార్షిక యంగ్ డాక్ట‌ర్స్ క్యాంప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌తి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ రాబోతుంది. న‌గ‌రానికి న‌లుమూల‌లా నాలుగు సూప‌ర్ స్పెషాలిటి ఆస్ప‌త్రులు నిర్మిస్తున్నాం. త్వ‌ర‌లో మెడిక‌ల్ సీట్లు భారీగా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆమె అన్నారు.

క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడే బ‌లంగా నిల‌బ‌డాలి. ఏ రంగం ఎంచుక‌న్నా నిబ‌ద్ధ‌త‌, మాన‌వ‌త్వంతో న‌డుచుకోవాలి. ఒక‌ప్పుడు ఆడ‌పిల్ల‌ల‌ను చ‌దివించాలంటే ఆలోచించే ప‌రిస్థితి ఉండేది. మోడ‌ల్ స్కూల్స్‌లో ప‌రీక్ష పెట్టిన‌పుడు చాలా మంది విభిన్న ర‌కాల వృత్తుల‌ను ఎంపిక చేసుకునేందుకు ఆస‌క్తి చూపారాన్నారు. ఒక పోర్ట‌ల్ ద్వారా విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం కెరీర్ గైడెన్స్ ఇస్తోంద‌ని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైద్య విద్య‌పై ఆస‌క్తి క‌లిగిన విద్యార్థుల‌కు దానిపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌దేళ్లుగా య‌శోదా ఆస్ప‌త్రి యంగ్ డాక్ట‌ర్స్ క్యాంప్‌ను నిర్వ‌హిస్ఓతంది.

Leave A Reply

Your email address will not be published.