ఎల్ఆర్ఎస్ రాయితీ గ‌డువు పెంపు: రాష్ట్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ప‌థ‌కం () రాయితీ గ‌డువును రాష్ట్ర ప్ర‌భుత్వం పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్లాట్ల‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు వీలుగా.. ఎల్ఆర్ఎస్ ఫీజు 25% రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 తో గ‌డువు ముగిసింది. తాజాగా ఈ గ‌డువును ఏప్రిల్ 30 వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడిగించింది. ఎల్ ఆర్ ఎస్ ఫీజు రాయితీపై చెల్లించేందుకు వీల క‌ల్పించినా.. స‌ర్కార్ అశించిన మేర రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌లేదు. దీంతో ప్ర‌భుత్వం గ‌డువు తేదీని మ‌రో నెల పొడిగించిన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.