చంద్రగ్రహణం: రాష్ట్రంలో ఆలయాల మూసివేత

హైదరాబాద్ (CLiC2NEWS): ఇవాళ (మంగళవారం) చంద్రగ్రహణం నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనా వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాలో నిత్య కైంకర్య పూజల అనంతరం మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 2.39 గం. నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం కొనసాగనుంది.
యాదాద్రి
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం 8.16 గంటలకు అధికారులు, అర్చకులు ద్వారా బంధనం నిర్వహించారు. చంద్రగ్రహణం నేపథ్యం లో ఇవాల తెల్లవారు జుమున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు నిజాభిషేకం, నత్యకైంకర్యాలు చేపట్టారు.
వేముల వాడ
గ్రహణం కారణంగా తెల్లవారుజామున 5.30 గంటలకు వేముల వాడ రాజన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తెరిచి పుణ్యవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులకు రాజన్న దర్శనానికి అనుమతించనున్నారు.
భద్రాద్రిలో
చంద్రగ్రహణం కారణంగా భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అర్చకులు, అధికారులు ఇవాళ (మంగళవారం) ఉదయం మూసివేశారు. ఆలయాన్ని రాత్రి 7.30 గంటల వరకు మూసే ఉంచనున్నామని అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు.
కాళేశ్వరం..
కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయాన్ని ఇవాళ ఉదయం అర్చకులు , అధికారులు స్వామి వారికి నిత్య కైంకర్యాల అనంతరం మూసివేశారు.
బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతిని ఇవ్వనున్నట్లు తెలిపారు.
బాసరలో..
చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని అధికారులు, అర్చకులు మూసివేశారు. గ్రహణం అనంతరం సాయత్రం 7.00 గంటలకు ఆలయం తెరిచి మహాసంప్రోక్షణ చేయనున్నారు.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.