నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం..

హైదరాబాద్ (CLiC2NEWS): నేడు కార్తీక పౌర్ణమి రోజున చంద్రగహణం కనువిందు చేయనుంది. సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత 15 రోజులకే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇది రెండవ చంద్రగ్రహణం. ఇలాంటి చంద్ర గ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుంది. నేడు ఏర్పడే గ్రహణం.. ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేయనుంది. భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా ప్రాంతాలలో కనిపించనుంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం 5.40 గంటలకు ఏర్పడనుంది. ఢిల్లీలో చంద్రగ్రహణం 5.28 గంటలకు, ముంబయిలో 6.01 గంటలకు ఏర్పడనుంది.