అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి: చిత్రం నుండి లిరికల్ సాంగ్

Arjun Son of Vyjayanthi: కల్యాణ్ రామ్, విజయశాంతి .. తల్లీ కొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. సయీ ముంజ్రేకర్ హీరోయిన్. ఈ చిత్రం నుండి లిరికల్ సాంగ్ విడుదలైంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినమాలోని ‘ముచ్చటగా బంధాలే.. ‘అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రఘురామ్ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు అజనీష్ లోకనాథ్ సంగీతం సమాకూర్చగా.. హరిచరణ్ ఆలపించారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను చిత్తూరులో ని ఎస్‌వి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, కల్యాణ్రామ్ , విజయశాంతి, హీరోయిన్.. తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోంతుందని.. ఆ కార్యక్రమానికి తమ్ముడు ఎన్‌టిఆర్ వస్తాడని కల్యాణ్‌రామ్ తెలిపారు.