‘కన్నప్ప’ నుండి ‘సగమై చెరి సగమై..’ లవ్‌సాంగ్ రిలీజ్

Kannappa: ముకేశ్ కుమార్‌సింగ్ దర్వకత్వంలో మంచు విష్ణు ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’. ప్రీతి శెట్టి కథానాయిక. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి లవ్ సాంగ్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 25 ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సగమై చెరి సగమై నువ్వునేను.. అంటూ సాగే లవ్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ స్వరాల సమకూర్చారు. శ్రీమణి సాహిత్యం అందించగా.. రేవంత్, సాహితి ఆలపించారు.